అప్పా జంక్షన్ వద్ద ప్రమాదం.. గుర్తుపట్టి బయటకులాగారు : ప్రమాదంపై రాజశేఖర్

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:31 IST)
తన కారు ప్రమాదానికి గురైన మాట నిజమేనని, ఈ ప్రమాదం జరిగినపుడు కారులో తాను ఒక్కరే ఉన్నానని, ఎదురుగా వస్తున్న కారులోని వ్యక్తులు తనను గుర్తించి బయటకులాగారని సినీ హీరో రాజశేఖర్ వెల్లడించారు. 
 
సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై రాజశేఖర్ తాజాగా స్పందించారు. 
 
మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద నా కారు ప్ర‌మాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్క‌డినే ఉన్నాను. ఎదురుగా వ‌స్తున్న కారులో వారు ఆగి, నా కారు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చారు. లోప‌ల ఉన్నది నేనే అని గుర్తు ప‌ట్టి, విన్ షీల్డ్‌లో నుండి బ‌య‌ట‌కి లాగారు. 
 
అప్పుడు నేను వెంట‌నే వారి ఫోన్ తీసుకొని మొద‌ట పోలీసుల‌కి, త‌ర్వాత నా కుటుంబ స‌భ్యుల‌కి స‌మాచారం అందించాను. అక్క‌డ నుండి వారి కారులో ఇంటికి బ‌య‌లుదేరాను. జీవిత‌, మా కుటుంబ స‌భ్యులు, ఎదురు వ‌చ్చి న‌న్ను పిక‌ప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నాను అని రాజ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. 
 
ప్ర‌స్తుతం క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ నిర్మిస్తున్న సినిమాలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments