Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 23న ‘తెలంగాణ దేవుడు’

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (18:29 IST)
Telangana Devudu
తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. అటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఓ మహానీయుని కథాంశంతో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. వడత్యా హరీష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్‌ మాట్లాడుతూ, ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు. హీరో శ్రీకాంత్‌గారు మా టీమ్‌ని ఎంతో హుషారుగా ముందుకు నడిపించారు. వారికి చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 23న చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను’ అని తెలిపారు.
 
నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్‌ అద్భుతంగా చూపించబోతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంతో మా అబ్బాయి జిషాన్ ఉస్మాన్ కూడా నటుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి మా ‘తెలంగాణ దేవుడు’ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రేక్షకులందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లలో మా సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
 
శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
నిర్మాత: మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్‌ ఖాన్.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments