బుక్ మైషోలో హనుమాన్ ఫుల్ జోష్, అంత కారం లేని గుంటూరు కారం

ఐవీఆర్
శనివారం, 13 జనవరి 2024 (16:16 IST)
సంక్రాంతి సంబరంలో విడుదలైన చిత్రాల్లో హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్. ఏదో చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకువెళుతోంది. బుక్ మై షోలో ఈ చిత్రం కోసం టిక్కెట్లు బుక్ చేద్దామంటే 15వ తేదీ వరకూ ఫుల్ అని కనబడుతున్నాయి. అదే సమయంలో గుంటూరు కారం ఓ మోస్తరుగా ఫుల్ అవుతుంటే, సైంధవ్ చిత్రానికి అసలు స్పందనే కరవవుతోంది.
 
మొత్తమ్మీద చూస్తే బుక్ మై షోలో హనుమాన్ చిత్రం కోసం గంటకు 25 వేల టిక్కెట్లు అమ్ముడవుతుంటే గుంటూరు కారం చిత్రానికి 10 వేలు చేరుకోవడమే గగనంగా మారింది. హనుమాన్ తొలిరోజు కలెక్షన్లు రూ. 22 కోట్లుకి చేరింది. మరో మూడు రోజుల పాటు హనుమాన్ చిత్రం టిక్కెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదంటే ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారని అర్థమవుతుంది.
 
చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ పెద్దచిత్రంగా సంక్రాంతి పండుగనాడు సందడి చేస్తోంది. ఈ చిత్రంలో నటించిన తేజ సజ్జా ఫుల్ జోష్‌లో వున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువలైజేషన్, నేరేషన్ గురించి ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments