Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంత్ వర్మ హను-మాన్ నుంచి 'శ్రీ రామధూత స్తోత్రం విడుదల

Hanuman sthotram
, బుధవారం, 3 జనవరి 2024 (13:53 IST)
Hanuman sthotram
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, టీం ‘హనుమాన్’ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పై ఎక్సయిట్మెంట్ ని పెంచుతున్నారు. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేసారు. అవన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. జానర్, కంపోజిషన్ పరంగా దేనికవే ప్రత్యేకమైన పాటలుగా అలరించారు. ఈరోజు, మేకర్స్ నాల్గవ సింగిల్-శ్రీరామధూత స్త్రోత్రం విడుదల చేశారు.
 
శ్రీ ఆంజనేయ స్తోత్రం థండర్స్ తో కూడిన బీట్స్ కి అనుగుణంగా గౌరహరి అద్భుతంగా కంపోజ్ చేశారు. సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఎడర, హర్షవర్ధన్ చావలి ఎనర్జిటిక్ వాయిస్ పాట  థీమ్‌తో ఇంటెన్స్ ని జోడిస్తుంది. ఈ లిరికల్ వీడియో 3D  ప్రజంటేషన్ చాలా అమెజింగ్ గా వుంది  విజువల్స్‌తో చూసినప్పుడు ఇది గూస్‌బంప్‌లను కలిగించనుంది.
మొదటి మూడు పాటల్లాగే శ్రీరామదూత స్త్రోత్రం కూడా మనసులని గెలుచుకోబోతోంది.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర, దీనికి ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.
 
తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న  మొదటి సినిమా హను-మాన్. సినిమా ముఖ్యంగా "అంజనాద్రి" అనే ఇమాజనరీ  ప్లేస్ లో సెట్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
 
హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ టెలిప్లే దక్షిణ-భారత ప్రేక్షకులకు ఆసక్తిని, థ్రిల్ చేస్తుంది: శిల్పా తులస్కర్