Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్‌తో తేజ బాగానే ప్లాన్ చేశాడు కానీ.. వ‌ర్కౌట్ అవుతుందా..?

Webdunia
గురువారం, 9 మే 2019 (11:29 IST)
బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం 'సీత'. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సోనూసూద్ విలన్‌గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. 

ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ నెల 24వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసారు. ఈ రోజు (మే 9) మహేష్ బాబు నటించిన "మహర్షి" భారీ స్థాయిలో విడుదలైంది. 'మహర్షి' చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లలో ఈ సినిమాతో పాటు సీత ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. 
 
ఇదంతా తేజ ప్లాన్ అని టాక్ వినిపిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. తేజ‌.. సీత ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డం బాగానే ప్లాన్ చేశాడు కానీ.. బెల్లంకొండ‌కు ఈసారి క‌లిసొస్తుందా..? తేజ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అనేది అనుమానం. సీత స‌క్స‌స్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments