Webdunia - Bharat's app for daily news and videos

Install App

లుంగీ కట్టిన బర్త్‌డే బాయ్... ''లవ్ స్టోరి'' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (18:50 IST)
అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవి, చిత్ర నిర్మాతలు కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నాగ చైతన్యకు బర్త్ డే విశెస్ తెలిపారు. ''లవ్ స్టోరి'' మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. థియేటర్ల పరిస్థితి మెరుగయ్యాక సినిమాను విడుదల చేయనున్నారు. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా తెరకెక్కుతున్న ''లవ్ స్టోరి'' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే... ఆయన లుంగీ, బనియన్ మీద కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
 
దర్శకుడు శేఖర్ కమ్ముల విశెస్ చెబుతూ..''కొన్ని స్నేహాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. చైతూతో అసోసియేషన్ అలాంటి సంతోషాన్నే ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అని ట్వీట్ చేశారు.
 
రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ''లవ్ స్టోరి'' చిత్రానికి సినిమాటోగ్రఫీ : విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు, రచన, దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

భార్యకు మరో వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. నుదుట సింధూరాన్ని తుడిచి.. దండలు...?

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments