Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:46 IST)
టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యపరిచారు.
 
ఇంతకీ ఆమె నిజంగా ఉపాధ్యాయురాలిగా మారలేదండోయ్. 'మార్పు కోసం విద్య' అనే కార్యక్రమంలో భాగంగా టీచర్‌గా అవతారమెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, కార్యక్రమ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొనగా, రెజీనా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యా వ్యవస్థ మార్పుకోసం శ్రీకారం చుట్టే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతివారంలో కనీసం 2 గంటల పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతానని హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాలంటీర్లు అవసరమని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నుంచి విద్యావంతులైన యువతీ యువకులవరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం వారికి 2 గంటలపాటు బోధన చేయడానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments