Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ బయోపిక్‌'కు తేజనే దర్శకుడు.. ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి దర్శకుడిగా తేజ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ చిత్రాలతో ఉన్న తేజ.. దగ్గుబాటి రానా హీరోగా తీసిన "నేనే ర

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:38 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి దర్శకుడిగా తేజ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ చిత్రాలతో ఉన్న తేజ.. దగ్గుబాటి రానా హీరోగా తీసిన "నేనే రాజు నేనే మంత్రి" చిత్రంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించే అంశంపై హీరో బాలకృష్ణ.. తేజను పిలిచి చర్చలు జరిపారు కూడా. 
 
నిజానికి తొలుత 'క్రిష్'.. లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారు. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో 'ఎన్టీఆర్' బయోపిక్‌పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తేజ... త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. అయితే, ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 
 
ఇంకోవైపు, నిరంతరం వివాదంలో ఉండే రాంగోపాల్ వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments