Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం పిచ్చోళ్ళను చేయొద్దు : టీడీపీ - బీజేపీలకు తమ్మారెడ్డి

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే, నిన్నామొన్నటివరకు బీజేపీ వైఖరిని ఆకాశానికెత్తిన అధికార టీడీపీ నేతలు ఇపుటు కమలనాథులపై

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (17:29 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే, నిన్నామొన్నటివరకు బీజేపీ వైఖరిని ఆకాశానికెత్తిన అధికార టీడీపీ నేతలు ఇపుటు కమలనాథులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా, విభాజిత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై గొడవ జరుగుతోంది. ఇదే అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 
 
వీటిపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ఆరు నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారని, టీడీపీ నేతలు, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోయారని అన్నారు.
 
'ప్రజలను తికమకపెట్టొద్దు. విడిపోయి కొట్టుకోండి. రెండు ప్రభుత్వాల్లో (కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ) మీరే ఉంటారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు! టీవీ ఛానెల్స్‌‌లో అల్లరి చేస్తారు! పేపర్లలో అల్లరి చేస్తారు! జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకపోతే, జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా? మీరు (బీజేపీ-టీడీపీ) ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి! నిజానిజాలు చెప్పండి! అదే నా కోరిక' అని తమ్మారెడ్డి ఘాటుగా మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments