Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బంపర్ ఆఫర్.. ఒక కేజీ కేక్ కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఫలితంగా చెన్నై మహానగరంలో ఒక లీటరు పెట్రోల్ ధ

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:56 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఫలితంగా చెన్నై మహానగరంలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.86 పైగా పలుకుతోంది.
 
ఈనేపథ్యంలో చెన్నై నగర వాసులకు ఓ బేకరీ షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక కేజీ కేక్ కొనుగోలు చేస్తే ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇపుడు వైరల్ అయింది. 
 
డీసీ బేకరీ ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ బేకరీలో ఒక కేజీ కేక్ ధర రూ.495. ఒక లీటరు పెట్రోల్ ధర రూ.86. సో... రూ.495 చెల్లిస్తే... ఒక లీటరు పెట్రోలును ఉచితంగా ఇస్తుందన్నమాట. అయితే, ఈ బేకరీ షాపు చిరునామా మాత్రం సోషల్ మీడియా పోస్టులో కనిపించడం లేదు. 
 
కాగా, దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ.82.32, రూ.89.92 ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments