Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

డీవీ
శనివారం, 30 నవంబరు 2024 (16:06 IST)
Kavin, Aparna Das
తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.
 
గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.
 
తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్టు అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments