Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ గర్ల్‌గా హాట్ బ్యూటీ తమన్నా..

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:42 IST)
మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా ఇపుడు హాట్ గర్ల్‌గా కనిపించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో త‌మ‌న్నా ఐటెం సాంగ్ చేస్తుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 
 
తమన్నా తన 30వ పుట్టినరోజు వేడుకలను శనివారం జరుపుకుంటున్నారు. ఇటీవ‌ల "సైరా" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంట్లో త‌మ‌న్నా పాత్ర‌కి ప్ర‌శంసలు ల‌భించాయి. ఇక 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్న త‌మ‌న్నాకి సంబంధించిన లుక్ తాజాగా విడుద‌లైంది. ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుంది.
 
'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అనే ఫన్నీ లిరిక్స్‌తో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌ ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పాటను షూట్ చేశారట. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య‌శాంతి దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంతో వెండితెర‌కి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments