Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యుడివో చంద్రుడివో.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ట్రీట్.? (video)

సూర్యుడివో చంద్రుడివో.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ట్రీట్.?  (video)
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:46 IST)
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్  'సరిలేరు నీకెవ్వరు'  చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ 'మైండ్ బ్లాక్' మాస్ నంబర్‌కి  ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 'సూర్యుడివో చంద్రుడివో' సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.
 
 అయితే ఈ రోజు షూటింగ్‌ జరుపుకుంటున్న మూడు వేరువేరు సినిమాల పాటల గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రోజు వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్.
 
అందులో సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరునీకెవ్వరు'  నుండి ఒక డాన్స్ నంబర్, వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ నుండి ఒక రొమాంటిక్ మెలోడీ, కీర్తి సురేష్ తదుపరి చిత్రం నుండి ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ఈ రోజు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
 
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతున్న సరిలేరు నీకెవ్వరులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధార్థ్ మూవీ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మెగా హీరో..?