రూ.15 కోట్లతో భారీ ఇంటిని నిర్మించుకున్న మిల్కీబ్యూటీ!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (06:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు 16 యేళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్ తమన్నా. ఈ ముద్దుగుమ్మకు వయసు మీదపడుతున్నప్పటికీ.. అటు అందంతో పాటు సినీ అవకాశాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఆమె తన స్థిర నివాసంగా ముంబైని ఎంచుకుంది. దీంతో ముంబై మహాగరంలో ఏకంగా రూ.15 కోట్ల వ్యయంతో సొంతింటిని నిర్మించుకుందట. ఈ విషయం తాజాగా వెల్లడైంది. 
 
ఓ ప్రముఖ పెయింటింగ్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని చూపించింది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో చాలా అద్భుతంగా నిర్మించుకుంది. ఇందుకోసం సుమారుగా రూ.15 కోట్లకు పైగానే ఖర్చు చేసింది. ఇప్పుడు ఇంటి వీడియోను చూపించి అందర్నీ ఆకట్టుకుంది. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని.. ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూసుకున్నాడని చెప్పుకొచ్చింది. 
 
విశాలమైన స్థలంలో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించారు. షూటింగ్స్‌ కారణంగా ఎక్కువగా తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోయినా కూడా నాన్నే పనులు కూడా పూర్తి చేశాడని వీడియోలో చెప్పుకొచ్చింది. షూటింగ్స్ కోసం ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఒక్కసారి తన సొంతింట్లోకి వచ్చి పడుకుంటే ఆ వచ్చే అనుభూతి మరెక్కడా దొరకదని తెలిపింది. 
 
ఇంట్లో ఉన్నపుడు తన తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ.. టీ తాగడాన్ని ఆస్వాదిస్తానని తెలిపింది. ఆ కంపెనీ తమన్నాతో నిర్వహించిన హోంటూర్‌లో ఈ విషయాలన్ని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన ఇంట్లో ఎంతో యిష్టమైన మరో మెంబర్‌ను పరిచయం చేసింది. అదే తన పెంపుడు కుక్క. దాదాపు ఎనిమిదేళ్లుగా అక్కడే ఉన్నామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments