Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్ నుంచి ‘మిల్కీ బ్యూటీ’ పాటని లాంచ్ చేసిన తమన్

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:52 IST)
mily beauty song
మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక  పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘మిల్కీ బ్యూటీ’ పాటని సెన్సేషనల్ కంపోజర్ తమన్ లాంచ్ చేశారు.
 
మహతి స్వర సాగర్ ఈ పాటని లవ్లీ లైవ్లీ మెలోడీగా స్వరపరిచారు. విజయ్ ప్రకాష్, సంజన కల్మంజే కలసి మహతి స్వర సాగర్ ఈ పాటని గ్రేస్ ఫుల్ గా ఆలపించారు. ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది.  
 
ఈ పాటలో చిరంజీవి డాన్స్, స్వాగ్ మెస్మరైజింగా వున్నాయి. మెలోడీ పాటల్లో మెగాస్టార్ డ్యాన్స్ చూడటానికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ పాటలో మెగా డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండగలా వున్నాయి. మెగాస్టార్ తో కలసి తమన్నా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
 
అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments