Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన జీవితాల్లోంచే బేబీ లాంటి కథలు వస్తాయి: అల్లు అర్జున్

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:06 IST)
Allu arjun with baby team
7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్  పెయిన్ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం- అని అల్లు అర్జున్ అన్నారు. 
 
టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్  సెన్సేషన్ బేబీ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని గురువారం రాత్రి సినిమా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం పట్ల సినిమా టీమ్ కృతజ్ఞతను, సంతోషాన్ని తెలియజేసింది. 
 
ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - బేబీ సినిమా టోటల్ టీమ్ కు నా కంగ్రాంట్స్ చెబుతున్నా. సినిమాను చించేశారు.  ఒకరోజు బేబీ ఫస్ట్ హాఫ్, మరో రోజు సెకండాఫ్ చూశా. సినిమా పూర్తయ్యాక సిక్సర్ కొట్టారు అనిపించింది. ఈ సినిమా గురించి గంట సేపు చెప్పగలను. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. సినిమా రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్మార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల పర్మార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్నసినిమాలు థియేటర్ లో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం.

సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయతీగా మద్దతు, ప్రేమ ఇస్తారు, అందుకు బేబీ సక్సెస్ నిదర్శనం. ఒక తల్లి బేబీని కనడానికి ఎంత కష్టపడుతుందో ఈ బేబీ సినిమా మేకింగ్ కోసం డైరెక్టర్ సాయిరాజేశ్ అంత కష్టపడ్డాడు. సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిరాజేశ్. కలర్ ఫొటో సినిమా చూసినప్పుడే అతను మంచి దర్శకుడు అనిపించింది. సాయిరాజేశ్ స్క్రిప్ట్ రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. నాకు పర్సనల్ గా ఇలాంటి కథలు ఇష్టం. అందుకే  బేబీ నచ్చిందేమో. ఈ సినిమా మీద ఆనంద్ పెట్టుకున్న నమ్మకమే ఈ సక్సెస్. విరాజ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. చాలా బాగా డీసెంట్ నటించాడు. అవార్డుల ఫంక్షన్స్ లో మన హీరోయిన్స్ కనిపించక బాధనిపించేది. ఇవాళ మన తెలుగమ్మాయి వైష్ణవి హిట్ కొట్టడం సంతోషంగా ఉంది. అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments