Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకిస్తున్న కరెంట్ బిల్లులు - తాప్సీ ఇంటికి రూ.36 వేల బిల్లు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (16:14 IST)
లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు తేరుకోలేని షాకిస్తున్నాయి. ఈ బిల్లులను చూసిన విద్యుత్ వినయోగదారులు బంబేలెత్తిపోతున్నారు. రెండు మూడు వేలు వచ్చే కరెంట్ బిల్లులు ఇపుడు ఏకంగా పది నుంచి 20 రెట్లు అదనంగా వస్తున్నాయి. వాటిని చూసిన విద్యుత్ వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 
 
తాజాగా, సినీ నటి తాప్సీకి ఏకంగా రూ.36 వేలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఈ అమ్మడు ఒకింత షాక్‌కు గురైంది. ఆ తర్వాత తేరుకుని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
ఇటీవల అలనాటి అందాల భామ రాధ కుమార్తె, హీరోయిన్‌ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఇపుడు తాప్సీ వంతు వచ్చింది. తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. 
 
సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్‌) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ట్వీటర్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది.
 
'ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది. 
 
మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు జనరేట్ చేశామనీ, ఇందులో తమ తప్పేం లేదని చెప్పుకొచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments