Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెంపలేసుకున్న తాప్సీ... రాఘవేంద్రరావుకు క్షమాపణలు (Video)

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును కించపరిచేలా వ్యాఖ్యానించిన నటి తాప్సీ.. ఎట్టకేలకు చేసిన వ్యాఖ్యలకు లెంపలేసుకున్నారు. పనిలోపనిగా దర్శకేంద్రుడికి కూడా క్షమాపణలు చెప్పారు.

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (13:41 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును కించపరిచేలా వ్యాఖ్యానించిన నటి తాప్సీ.. ఎట్టకేలకు చేసిన వ్యాఖ్యలకు లెంపలేసుకున్నారు. పనిలోపనిగా దర్శకేంద్రుడికి కూడా క్షమాపణలు చెప్పారు. 
 
ఇటీవల ఓ కార్యక్రమంలో తన తొలి చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ, ఎందరో హీరోయిన్లపై పూలు, పండ్లు విసిరిన ఆయన, తన బొడ్డుపై కొబ్బరి చిప్పలు విసిరేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌ వ్యాప్తంగా కలకలం రేపాయి. 
 
దీనిపై ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, తాప్సి తన వివరణ చెప్పుకొచ్చింది. ఆ కార్యక్రమం పావు గంట పాటు సాగిందని, మిగతా భాగాన్ని వదిలేసి, కేవలం 10 సెకన్ల బిట్‌ను పదే పదే చూపి తనపై తప్పుడు ప్రచారాన్ని చేశారని ఆరోపించింది. 
 
మొత్తం వీడియోను చూడకుండా, తానన్న మాటలు వినకుండా రాద్ధాంతం చేశారని తాప్సీ ఆరోపించింది. ఈ విషయంలో రాఘవేంద్రరావు బాధపడ్డారని తనకు తెలిసి, ఆయనకు క్షమాపణలు చెప్పానని, అసలు విషయాన్ని చెబుతూ తాను స్వయంగా మాట్లాడానని ఆయన కూడా తనను ఆశీర్వదించారని అంది. తనకు తెలుగు సినిమాలన్నా, తెలుగువారన్నా ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments