Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ.. పేరు 'సమసమాజ్ పార్టీ'

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మా

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (13:17 IST)
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. 
 
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. 'బిగ్‌ బాస్'షోతో బుల్లితెర మీద హల్‌చల్‌ చేస్తున్నారు. మరోవైపు ‘జై లవకుశ’ సినిమా పనులతో కూడా బిజీగా ఉన్నాడు. బాబి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీయార్‌ పోషిస్తున్న ‘జై’ క్యారెక్టర్‌ గురించిన టీజర్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్‌ రాజకీయనాయకుడిగా కూడా కనిపించబోతున్నాడట. ‘సమసమాజ్‌’ పార్టీ నేతగా ఎన్టీయార్‌ కనిపించనున్నాడట. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
సమసమాజ్' పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీయార్‌ బొమ్మలు ఉన్న ఫోటలు వర్కింగ్‌ స్టిల్స్‌గా బయటకు వచ్చాయి. అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్‌, హిందీ బాషల్లో ఉండడంతో.. ఎన్టీయార్‌ ఉత్తరాదికి చెందిన రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments