Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌పై కన్నేసిన బాహుబలి డైరెక్టర్... యంగ్ హీరోతో మూవీకి ప్లాన్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత చేపట్టే భారీ ప్రాజెక్టుపైనే ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టీ నెలకొనివుంది. ముఖ్యంగా రాజమౌళి తదుపరి ఏం చేయబోతున్నాడు అన్నదానిపై కూడా అంత సస్పెన్స్ నెలకొంద

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (13:10 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత చేపట్టే భారీ ప్రాజెక్టుపైనే ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టీ నెలకొనివుంది. ముఖ్యంగా రాజమౌళి తదుపరి ఏం చేయబోతున్నాడు అన్నదానిపై కూడా అంత సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు.. రాజమౌళి ఏం చేసినా అది న్యూస్ అవుతోంది. 'బాహుబలి' తర్వాత జక్కన్న చేయబోయే సినిమా గురించి, ఏ హీరోతో యాక్ట్ చేస్తాడనే విషయంపైనా రకరకాల ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి.
 
ఈనేపథ్యంలో రాజమౌళి తదుపరి మూవీ టాలీవుడ్ ది కాక బాలీవుడ్ సినిమా చేస్తాడని లేటెస్ట్‌గా ఓ న్యూస్ బలంగా వినిపిస్తోంది. నిజానికి బాహుబలి తర్వాత రాజమౌళితో సినిమాకోసం బాలీవుడ్‌లో కూడా ప్రొడ్యూసర్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రాజమౌళి ఈమధ్య ఓ మాట చెప్పాడు. తను చేయబోయే మూవీ‌లో బడ్జెట్‌‌ది కాదని, అలాగని మరీ భారీ మూవీ కాదని చెప్పాడు.
 
రాజమౌళి డైరెక్ట్ చేయబోయే బాలీవుడ్ సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తాడనీ.. బాలీవుడ్ నిర్మాత ఒకరు ఈ సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటాడని కూడా అంటున్నారు. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందట. డిసెంబర్ నాటికి పూర్తి స్క్రిప్ట్ సిద్ధంచేసే పనిలో దర్శకధీరుడు నిమగ్నమైవున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments