Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీతో నటించినంత మాత్రానా స్టారా? చీరలో రాకుండా సారీనా?: టీఆర్ ఫైర్-ధన్షిక కన్నీరు (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా కబాలి సినిమాలో నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి వుంటుంది. ఆ చిత్రంలో బోల్డ్‌గా ఫైట్స్ చేసేసే ధన్షిక.. తాజాగా స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. కోలీవుడ్‌లో స్టార్,

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:53 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా కబాలి సినిమాలో నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి వుంటుంది. ఆ చిత్రంలో బోల్డ్‌గా ఫైట్స్ చేసేసే ధన్షిక.. తాజాగా స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. కోలీవుడ్‌లో స్టార్, శింబు తండ్రి టి. రాజేందర్ ఆమెను స్టేజీపై ఏడ్చేలా చేశాడు. తాజాగా విళితిరు సినిమాలో హీరోయిన్‌గా ధన్షిక నటించింది.

ఇందులో టి.రాజేందర్ అభిమానిగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రం కోసం పనిచేసిన అందరి పేర్లను ప్రస్తావించిన ధన్సిక.. ఆ చిత్రంలో ఓ పాట పాడిన టి.రాజేందర్ పేరు చెప్పడం పొరపాటున మరిచిపోయి కూర్చుండిపోయింది.
 
దీనిని టి. రాజేందర్ అవమానంగా భావించి ధన్షికపై శివాలెత్తారు. వేదికపైనే చీవాట్లు పెట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించినంతమాత్రాన స్టార్ అయిపోరని ఎద్దేవా చేశారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. వేదికపై ఎలా మాట్లాడాడో తెలుసుకోమన్నారు. పెద్ద ఆర్టిస్టులకు గౌరవించడం నేర్చుకోకపోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు. 
 
దీంతో షాక్ తిన్న ధన్షిక వెంటనే తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ స్టేజ్‌పై ప్రసంగించడం అలవాటు లేదని చెప్పింది. అందువల్లే పొరపాటు జరిగిందని.. క్షమించాల్సిందిగా కోరింది. అయినా కనికరించని రాజేందర్.. చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావని చీవాట్లు పెట్టారు. నువ్విచ్చే గౌరవాన్ని తాను  ఏ మార్కెట్లో అమ్ముకుంటానని కొట్టిపారేశారు. దీంతో ఖిన్నురాలైన ధన్షిక కన్నీటిపర్యంతమైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments