Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛీ... పో... నాకు సిగ్గు, యాంకర్ శ్రీముఖి రీట్వీట్... ఎవరికి? ఎందుకు?

యాంకర్ శ్రీముఖి ఈమధ్య యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సుమ, ఝాన్సీ, ఉదయభాను, రేష్మి, అనసూయల తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న యాంకర్‌గా శ్రీముఖి గుర్తింపుతెచ్చుకుంది. ఇకపోతే ఝాన్సీ, అనసూయ యాంకర్లు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలకే పరిమితమయ్యారు. యాం

Advertiesment
Anchor Srimukhi
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:36 IST)
యాంకర్ శ్రీముఖి ఈమధ్య యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సుమ, ఝాన్సీ, ఉదయభాను, రేష్మి, అనసూయల తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న యాంకర్‌గా శ్రీముఖి గుర్తింపుతెచ్చుకుంది. ఇకపోతే ఝాన్సీ, అనసూయ యాంకర్లు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలకే పరిమితమయ్యారు. యాంకర్ రేష్మి హాటెస్ట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే బాటలో యాంకర్ శ్రీముఖి నడుస్తోంది. 
 
హర్షవర్ధన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె నటించే పాత్ర పల్లెటూరి పిల్ల పాత్ర. ఆ పాత్ర అచ్చం గతంలో భానుప్రియ నటించిన స్వర్ణకమలం చిత్రంతో పోలి వుంటుందట. అందుకే ఆమె ఫోటోను పక్కన పోస్టు చేసి భానుప్రియ మాదిరిగా ఫోజిస్తూ తన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. 
 
దీన్ని చూసిన నటుడు వెన్నెల కిషోర్ ట్విట్టర్లో ... ఇంతకీ భానుప్రియ మీకు కుడివైపు వున్నారా లేదా ఎడమవైపు వున్నారా అంటూ ప్రశ్నను లేవనెత్తారు. దానికి శ్రీముఖి ... ఛీ.. పో.. నాకు సిగ్గు అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. అదీ సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారి-2లో ఫిదా హీరోయిన్.. ధనుష్ సరసన సాయిపల్లవి