Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్క‌డ‌..? గెస్ట్‌లు ఎవ‌రు.?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:36 IST)
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జరుపుకుంటోంది. 
 
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తరువాత సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.తొలితరం రేనాటి స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని క‌ర్నూలులో చేయాలి అనుకున్న‌ప్ప‌టికీ... లాస్ట్ మినిట్లో వేదిక హైద‌రాబాద్‌కి మారింది. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
 
ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, సెన్సషనల్ డైరెక్టర్ వి వి.వి. వినాయక్ అతిధులుగా రానున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, జగపతి బాబు తదితర దిగ్గజ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ  ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. మ‌రి.. మెగాస్టార్ సైరాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఏస్ ఆమ్రపాలిపై తెలంగాణ సర్కారుకు ఎందుకో అంత ప్రేమ?

వివాహిత మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం- సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కేసు

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

చిల్లర్లేదు.. ఇక రాయన్న రైల్వేస్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments