Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ గడ్డపై నుంచి "సైరా" ట్రైలర్ రిలీజ్!?

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (15:39 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార వంటి అనేక మంది అగ్ర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. 
 
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హీరో రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. వచ్చే అక్టోబరు రెండో తేదీన గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌తో ఇతర గ్రాఫిక్స్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. 
 
అయితే, చిత్రంలో బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాలకి సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయ‌ని అంటున్నారు. చిత్ర ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా ఓ వార్త బ‌య‌టికి వచ్చింది. 
 
ఆగస్టు 15, 16వ తేదీల్లో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ సమయంలోనే సైరా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. హిందీతో పాటు సౌత్‌లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్‌ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments