చరిత్ర మనతోనే మొదలవ్వాలి : సైరా టీజర్ రిలీజ్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:41 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ టీజర్ కోసం మెగా అభిమానులంతా ఎపుడెపుడా అని ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. అక్టోబరు రెండో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. 
 
ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయస్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి హేమాహేమీ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
అయితే, తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో ఇది మొదలవుతుంది. "చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ, చరిత్ర మనతోనే మొదలవ్వాలి" అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది. 
 
ఈ సినిమాను అక్టోబరు రెండో తేదీన గాంధీజయంతి సందర్భంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. మెగాస్టార్ యాక్షన్ సీన్లతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ టీజర్‌నూ మీరూ చూసేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments