Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్‌కు ముందే కనకవర్షం

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:56 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ రూ.కోట్లలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అర్థరాత్రి నుంచే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో ఉండటంతో... ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది.
 
మరోవైపు, 'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో సాగినట్టు వార్తలు సమాచారం. ముఖ్యంగా, ఒక్క తెలుగు భాషలోనే దాదాపు రూ.150 కోట్ల మేరకు వ్యాపారం జరిగినట్టు వినికిడి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ.108 కోట్ల బిజినెస్ జరిగింది. విదేశాల్లో తెలుగు రైట్స్‌తో కలపుకుంటే ఇది రూ.150 కోట్లకు చేరింది. 
 
మరోవైపు కన్నడలో కూడా ఈ చిత్రం చేసిన బిజినెస్ మామూలుగా లేదు. ఏకంగా రూ.27 కోట్ల వరకు బిజినెస్ చేసింది. హిందీ వర్షన్‌లో కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో కలుపుకుని రూ.200 కోట్ల మేరకు జరిగినట్టు సమాచారం. కాగా, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉండటంతో... బాలీవుడ్‌లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments