Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలర్స్ స్వాతికి పెళ్లైపోయింది.. పైలట్‌ ప్రేమికుడితో డుం.. డుం.. డుం..

యాంకర్‌గా, నటిగా, గాయకురాలిగా కలర్స్ స్వాతి పేరు కొట్టేసింది. డబ్బింగ్ కళాకారిణిగానూ మంచి మార్కులు కొట్టేసింది. మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (18:15 IST)
యాంకర్‌గా, నటిగా, గాయకురాలిగా కలర్స్ స్వాతి పేరు కొట్టేసింది. డబ్బింగ్ కళాకారిణిగానూ మంచి మార్కులు కొట్టేసింది. మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. 
 
నటిగా స్వాతి కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ సినిమాలో నటించింది. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం సక్సెస్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. 2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.
 
కలర్స్ స్వాతి అని పిలువబడే స్వాతిరెడ్డి శుక్రవారం తన ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకుంది. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న వికాస్‌ను పెళ్లాడింది. తమ ప్రేమను ఇంట్లో ఒప్పించి, పెద్దల ఆశీస్సులతో వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.
 
ఇక సెప్టెంబర్ 2న కొచ్చిలో కొత్త జంట రిసెప్షన్ ఇవ్వనుంది. ప్రస్తుతం కలర్స్ స్వాతి పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లికి తర్వాత ఏం చేయబోతుందని ప్రస్తుతం చర్చ మొదలైంది. నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తుందా? లేక కుటుంబ బాధ్యతలకే పరిమితమవుతుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments