Webdunia - Bharat's app for daily news and videos

Install App

450 కేంద్రాల్లో స్వదేశ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీస్‌ థియేటర్లు!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (19:03 IST)
ఆంధ్ర, తెలంగాణాల్లో థియేటర్లు నిర్మించేందుకు స్వదేశ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ముందుకు వచ్చింది. ఏకంగా 450 థియేటర్లు నిర్మించబోతోంది. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారంనాడు హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా మోడురి కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. సుమారుగా 450 కేంద్రాల్లో థియేటర్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 
 
ప్రతి ప్రాంతంలో ఒక మాల్‌‌లో భాగంగా కనీసం రెండు స్క్రీన్స్‌‌ను నిర్మించాలనుకుంటున్నాం. అలానే సినిమాల నిర్మాణం కోసం 1000 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ ను కేటాయిస్తున్నాం. ఔత్సాహికులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఉన్న థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. ఉన్న థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ప్లాన్‌ చేస్తున్నాం. 
 
అలానే పూణేలో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్‌ మాదిరి హైదరాబాద్‌‌లో సకల వసతులతో కూడిన ఫిలిం ఇన్స్టిట్యూట్‌‌ను స్థాపించాలనుకుంటున్నాం. 'ఇంటిగ్రేటెడ్‌ ఫిలిం ట్రైనింగ్‌ సెంటర్‌' అనే ఈ ప్రపోజల్స్‌‌ను తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలను కలిసి వారందరితో కలిసి అడ్వైజరీ కమీటీను ఏర్పాటు చేస్తాం. జూలై 1 నుండి మా సంస్థ ఈ కార్యకలాపాలన్నింటినీ మొదలుపెట్టనుంది'' అని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments