Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కి రేణూ దేశాయ్, హృతిక్‌కు సుసానే... మాజీ భర్తలపై ఘాటు ప్రేమలు...

రేణూ దేశాయ్... జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. రేణూ దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని వేరు పడిపోయినప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ వుంటుంది.

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (15:50 IST)
రేణూ దేశాయ్... జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. రేణూ దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని వేరు పడిపోయినప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ వుంటుంది. 
 
ఇటీవలే సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ట్వీట్ చేస్తూ... సమాజం కోసం తపించే మంచి మనిషి పవన్ కళ్యాణ్ అని పేర్కొంది. ఇంకా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన గత స్మృతులను నెమరువేసుకుంటూనే వుంటుంది. పవన్ గురించి మాట్లాడకుండా వుండదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా పిల్లల వద్దకు వెళ్లి వస్తుంటారు.
 
ఇప్పుడు ఇలాంటి జంట ఒకటి బాలీవుడ్‌లో కూడా కనబడుతోంది. ఆ జంట ఇంకెవరో కాదు... కండల వీరుడు హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానె. సుసానె ఇటీవలే తన భర్త హృతిక్ రోషన్ నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భర్త హృతిక్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇంతెత్తున లేస్తోంది. 
 
తాజాగా హృతిక్ పైన కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యపై సుసానే మండిపడింది. ఎప్పటినుంచో హృతిక్ రోషన్ గురించి కంగనా రనౌత్ కామెంట్లు చేస్తోంది. తనను ప్రేమించి దారుణంగా వంచించాడంటూ తాజాగా కంగానే రనౌత్ పేర్కొనడమే కాకుండా హృతిక్‌తో వున్న ఇంటిమేట్ ఫోటోలను పోస్టు చేసింది. 
 
దీనిపై సుసానె స్పందిస్తూ... మంచి మనుషులకు ఇలాంటివేవీ తగలవు అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. అంతేకాకుండా... అవన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోలని బుకాయించింది. కానీ కంగనా షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే అవి మార్ఫింగ్ ఫోటోలని నమ్మబుద్ధి కావడంలేదు. మరి నిజం ఎవరిదో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments