Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు విడుద‌ల అవుతుందా..? లేదా..?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (11:41 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ఎన్టీఆర్. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ పార్ట్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిలీజ్ కావ‌డం.. డిజాస్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రం విడుద‌లపై రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో అభిమానుల్లో టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు.
 
అయితే.. ఫ‌స్ట్ పార్ట్ డిజాస్టర్ అవ్వ‌డంతో సెకండ్ పార్ట్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నార‌ట‌. దీంతో ముందు అనుకున్న‌ట్టుగా ఫిబ్ర‌వ‌రి 7న కాకుండా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు అనే టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మ‌రోసారి వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 14న కూడా రిలీజ్ ఉండ‌దు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే ఎలాంటి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌లేదు. దీంతో ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనేమో అనిపిస్తుంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై చిత్ర‌యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments