Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాత్ర ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు ముహుర్తం ఖ‌రారు..!

Advertiesment
Yaatra pre-release
, ఆదివారం, 27 జనవరి 2019 (21:42 IST)
దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రం యాత్ర.  వైఎస్సార్ సీఎం కావడానికి దోహదపడిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి.రాఘవ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. 
 
వైఎస్సార్ పాత్రలో మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ వచ్చిన తరవాత ఆ అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి. 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శివ మేక సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. 
 
అయితే... విడుదలకు ముందుకు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అనేది ఖ‌రారు చేసారు. ప్రీ రిలీజ్ వేడుకను ఫిబ్రవరి 1న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్రలో అశ్రిత వేముగంటి నటించారు. జగపతిబాబు, అనసూయ, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. మ‌రి.. యాత్ర బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిస్కో రాజాగా రాబోతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ