సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు ఏమయ్యాయి..? (video)

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:18 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఈడీ కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఈడీ నోటీసుల ప్రకారం రియా శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటీషన్‌పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంలో తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడాన్ని వాయిదా వేయాలని ఈడీని రియా కోరింది. రియా అభ్యర్ధనని ఈడీ తిరస్కరించింది. 
 
అయినప్పటికీ రియా హాజరుకాకపోవడంతో ఆమెపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉంది ఈడీ. ఇప్పటికే సీబీఐ రియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, సుశాంత్ రాజ్‌పుత్ కేసులో తాజాగా మరో ఇద్దరికి ఈడీ సమన్లు పంపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీకి సమన్లు పంపగా, ఆయన నేడు విచారణకు హాజరుకావాల్సి ఉంది. 
 
ఇక సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా ఈడీ నోటీసులు పంపగా, రేపటిలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుశాంత్ అకౌంట్ నుండి వేరే అకౌంట్స్‌కి నగదు లావాదేవీలు జరిగిన పక్షంలో ఈడీ రంగంలోకి దిగి నిజనిజాలు బయటపెట్టేందుకు కృషి చేస్తుంది.
 
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో లోతుగా వెళ్లే కొద్ది పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్‌ను కావాలనే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై ఏ1 గా చేరుస్తూ కేసు ఫైల్ చేసింది. 
 
మరోవైపు ఈ సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తి తల్లి తండ్రులను సోదరుడితో పాటు శామ్యూల్ మిరిండా, శృతి మోడీలను నిందితులుగా చేర్చింది సీబీఐ. మరోవైపు సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో కన్నుమూసిన జూన్ 14 ముందు రియా చక్రబర్తికి సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో రియాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలుస్తోంది. 
 
సుశాంత్‌కు చెందిన కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి ఈ నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో రియా కుటుంబ సభ్యులు ముంబైలో కమర్షియల్ ఏరియాలో రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేసారా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
 
మరోవైపు ఈ కేసులో కీలకమైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు మిస్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనడానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం - ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments