Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిస్ యూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" ... బాలీవుడ్‌ యువ సంచలనం...

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (09:48 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఒక హీరోగానే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ హీరోనే. ఎలాంటి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న యవసంచలనం. ఆయన ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా కనిపించకుండా పోయారు. చివరకు ఈ లోకంలోనే లేకుండా వెళ్లిపోయారు. 
 
‘కైపోచే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన సుశాంత్.. ‘ఎం.ఎస్.ధోని’, ‘చిచోరే’, ‘దిల్ బేచారా’ చిత్రాలతో అటు నార్త్ అభిమానులకే కాదు.. ఇటు సౌత్ ఫ్యాన్స్‌కు కూడా ఫేవరెట్ హీరో అయిపోయారు. సైన్స్, స్పేస్ ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో అణిచివేతకుగురైన హీరో ఎవరైనా ఉన్నారన్నా.. ఫ్యాన్స్‌కు ముందుగా గుర్తొచ్చే పేరు సుశాంత్. 
 
అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లిన రోజు నేడు (జూన్ 14). నేటికి ఒక యేడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది. సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించేందుకు ఐదు ఇన్వెస్టి‌గేటివ్ సంస్థలు రంగంలోకి దిగినా.. ఎవరూ విజయం సాధించలేకపోయారు. 
 
2020 జూన్ 14వ తేదీన ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును చేధించేందుకు ముంబై పోలిస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలో దిగాయి.
 
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చగా.. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్‌సీబీ అధికారులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు కొందరు డ్రగ్ డీలర్స్‌ను అరెస్ట్ చేశారు. 
 
అంతేకాకుండా, బీ-టౌన్‌కు మాఫియాకు కూడా సంబంధాలు ఉన్నట్టు తేలడంతో బాలీవుడ్ నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్‌లను కూడా ఎన్‌సీబీ విచారించింది. అయితే, ఈ విచారణ ఫలితాలు లేవి బయటికి రాలేదు. ఇక అరెస్ట్ అయిన నెల రోజులకు రియా బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అటు సీబీఐకి ఈ కేసు అప్పగించి పది నెలలు గడుస్తున్నా.. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ బయటికి రాలేదు. 
 
మరోవైపు సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాకు గానీ, ఆమె కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు గానీ డబ్బు బదిలీ కాలేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేల్చారు. 
 
2020 జులై 27న ఫోరెన్సిక్ ల్యాబరేటరీ కూడా సుశాంత్‌ది హత్య కాదని.. ఆత్మహత్యనేనని పోలీసులకు నివేదికను సమర్పించాయి. ఈ కేసులో బీహార్ పోలీసులు జోక్యం చేసుకోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఇలా ఈ ఐదు సంస్థలు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments