బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాటి నుంచి బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ యువనటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని సినిమాలో కో స్టార్‌గా నటించిన సందీప్ నహర్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై గోరేగావ్ ప్రాంతంలోని తన నివాసంలో సందీప్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ నహర్ ఎంస్ ధోని సినిమాతో పాటు.. అక్షయ్ కుమార్ తో కలిసి అన్‌టోల్డ్ స్టోరీ, కేసరి వంటి మూవీల్లో నటించాడు.