విశాఖలో నాన్నగారి షూటింగ్ రోజులు గుర్తుచేసుకుంటూ డాన్స్ చేసిన సూర్య

డీవీ
సోమవారం, 28 అక్టోబరు 2024 (14:01 IST)
Suya dance
సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. '

Suya dance
కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  ఈ రోజు వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో అరకు తదితర ప్రాంతాలనుంచి వచ్చిన వారితో డాన్స్ వేసి అందరినీ అలరించారు సూర్య.
 
హీరో సూర్య మాట్లాడుతూ, ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్ తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్ తో అనుబంధం కొనసాగుతోంది. నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్ లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్ లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్ లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments