Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

Advertiesment
dulkar, Vijay Deverakonda, trivikram

మురళి

, సోమవారం, 28 అక్టోబరు 2024 (07:07 IST)
dulkar, Vijay Deverakonda, trivikram
దుల్కర్ సల్మాన్.ఇప్పుడు "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
 
 త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్ గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు.  మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్ లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నా మనసుకు దగ్గరైంది. ఈ సినిమాలో నేను అందరికంటే ఎక్కువ ఫ్యాన్ అయిపోయింది అంటే రాంకీ గారి పాత్ర. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే నెగ్గాలని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది అక్కడినుండే వచ్చాము కదా. అడ్వెంచర్ చేసి, దాని నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడటం అనేది హోప్. ఆ హోప్ సినిమా చూసిన తర్వాత ఫైనల్ గా కంప్లీట్ అవుతుంది. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. 
 
అలాగే విజయ్ గురించి రెండు మాటలు చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకడు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. మా వాడే మహా గట్టివాడే అని.. మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు. దుల్కర్ గారిని నేను పెద్దగా కలవలేదు. షూటింగ్ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను నేను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను. ఇండియన్ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్ మలయాళం సినిమాలో ఒక మైల్ స్టోన్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా నాగవంశీకి, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు." అన్నారు.
 
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్ కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. రాసిపెట్టుందేమో 'VD12' నేను, గౌతమ్ సితారలో చేయాలని. త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్ లో ఒక బిగ్ మూమెంట్. 
 
మన జనరేషన్ కి తెలుసు మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమానుల్లో దర్శకుల్లో ఒకరు. ఆ తర్వాత ఆయనను చాలాసార్లు కలిశారు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి త్రివిక్రమ్ గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చోవచ్చు. 
 
ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి. లక్కీ భాస్కర్ తో వెంకీ ఒక కొత్త లెవెల్ అన్ లాక్ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి పాత్ర లభించిందని అర్థమవుతోంది. నేను నటుడు కాకముందు నుండే దుల్కర్ సినిమాలు చేస్తుండేవాడిని. మేము మహానటి, కల్కి సినిమాలు కలిసి చేశాను. నా సోదరుడు దుల్కర్ సినిమా వేడుకకు రావడం సంతోషంగా ఉంది. దుల్కర్ కి, సితారకి, వెంకీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. " అన్నారు.
 
కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..  అందరం కలిసి ఒక కుటుంబంలా ఈ సినిమా చేశాము. అందరితో మంచి అనుబంధం ఏర్పడింది. మీనాక్షి అందంగా ఉండటమే కాదు, అంతే అందంగా నటించింది. ఈ సినిమాకి నేను మూడు భాషల్లో డబ్ చేశాను. ఈ సినిమాలో మీనాక్షి పాత్ర అందరికీ గుర్తుంటుంది. రిత్విక్ చాలా బాగా నటించాడు. త్రివిక్రమ్ గారికి నేను పెద్ద అభిమానిని. అల వైకుంఠపురములో సినిమా అంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి రచనలో ఎంతో లోతు ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో కూడా లోతైన మాటలు రాయడం ఆయనకే చెల్లుతుంది. రాంకీ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. విజయ్ దేవరకొండ నా తమ్ముడు. నా మహానటి, సీతారామం సినిమాలకు విజయ్ వచ్చాడు. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ కి వచ్చాడు. ఇది విజయం సాధిస్తుంది. విజయ్ నా లక్కీ చార్మ్. లక్కీ భాస్కర్ ఒక కామన్ మ్యాన్ స్టోరీ. ఇది మీ అందరికీ నచ్చుతుంది. " అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్