Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ రీల్ అండ్ రియల్ లైఫ్‌లోనూ ఒకేలా వుంటారు.. కంగువ హీరో (Video)

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (12:16 IST)
Surya
స్టార్ హీరో సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తుంది చిత్ర యూనిట్.
 
హైదరాబాద్ వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ జరిగిన ఈ సినిమా ఈవెంట్లో చాలామంది తెలుగు నటుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సూర్య.
 
డార్లింగ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. కల్కి సినిమా తనకు బాగా నచ్చింది. ఈగర్ లీ వెయిటింగ్ ఫర్ కల్కి టు అంటూ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రియల్ లైఫ్ లోనూ, రీల్ లైఫ్‌లోనూ ఆయన ఒకేలా ఉంటారు ఇస్ క్యాండేడ్ అండ్ ఓపెన్ హార్టెడ్ అంటూ తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు జూనియర్ అని, అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. 
 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ కేవలం 15 సినిమాల్లో మాత్రమే నటించాడు. ఆయన ఆల్రెడీ గ్లోబల్ స్టార్, గ్లోబల్ యాక్టర్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటూ తెలుపుకొచ్చారు. 
 
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ లా తెలుగు డిక్షనని ఎవరు మాట్లాడలేరు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంటూ తెలిపారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి కంగువ హీరో సూర్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు కంగువ మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా తెలుగు బుల్లితెర టాప్ షో అయిన బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చారు. సూర్యతో పాటు కంగువ డైరెక్టర్ శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా వచ్చారు. తమ సినిమాకి సంబందించిన చాలా విషయాలను తెలిపారు. 
 
అలా సూర్య మాట్లాడుతున్న సమయంలో.. ఎంత చక్కాగా తెలుగు మాట్లాడుతున్నావ్ అని నాగ్ అన్నారు. అప్పుడు సూర్య నవ్వుతూ.. లేదన్న నేను ఇంకా పర్ఫెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఈ విషయంలో నేను  కార్తీపై ఎప్పుడూ అసూయ పడతానని అన్నారు. కార్తీ తెలుగులో చాల స్పష్టంగా, అర్ధవంతంగా మాట్లాడతాడని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments