Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1న వస్తున్న సూపర్ స్టార్ సూర్య "మేము"

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (16:42 IST)
సూపర్ స్టార్ సూర్య - అమలాపాల్ - బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాదమవుతుండటం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌‌ను "స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2డి ఎంటర్‌టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండటం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "సూపర్ స్టార్ సూర్య - స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాల సంయుక్త సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. "ప్రతి తల్లీతండ్రి తమ పిల్లలతో కలిసి ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఇది" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం ముక్త కంఠంతో తీర్మానించిన గొప్ప సినిమా ఇది. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ "మేము" చిత్రంతో తన ప్రతిభాపాటవాలు మరోసారి నిరూపించుకున్నాడు. 
 
జూలై 1న ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు - పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞాన‌వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాండిరాజ్.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments