Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే ఎనర్జీ.. అదే స్టైల్... 'కత్తి'లా ఉన్న చిరంజీవి.. 150వ మూవీ రెగ్యులర్ షూటింగ్

మెగాభిమానులు, ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న తరుణంరానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైనా ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని అంతా

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (16:33 IST)
మెగాభిమానులు, ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న తరుణంరానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైనా ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మెగాభిమానుల్లో హుషారు పెంచుతూ ల్యాండ్ మార్క్ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి తొలిరోజునే అడుగుపెట్టారు. మేకప్‌తో ఎంటరై మునుపటిలానే అదే జోష్‌తో సెట్లో సందడి చేశారు. దీంతో రెగ్యులర్ షూటింగ్ షురూ అయినట్టే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వి.వి.వినాయక్ మాట్లాడుతూ గురువారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, అలీ పాల్గొనగా టాకీ పార్టుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ వచ్చే నెల 12వ తేదీ వరకూ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో సన్నివేశాలు చిరంజీవి అభిమానులకు కానీ, థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కానీ చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా ఆయన గ్లామర్ చూసి చాలా ముచ్చటపడిపోతారు. అంత గ్లామర్‌గా ఉన్నారు. ఇక సినిమాలో పరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా ఉంటారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తారు.
 
చిరంజీవి కొత్త లుక్‌తో కూడిన టీజర్‌ని కూడా అభిమానుల కోసం త్వరలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ భారీ షెడ్యూల్‌గా ఉంటుంది. ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. 'ఠాగూర్' తర్వాత చిరంజీవితో మళ్లీ చాలా ప్రత్యేకమైన సినిమా చేస్తున్నా. ఇది ఆయనకు 150వ సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నా. ఈ కథలో చిరంజీవి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్టైన్‌మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. 
 
ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవితో పాటు నిర్మాత రాంచరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు. వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం. చరణ్ ఈ సినిమాని భారీగా నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నారు. మంచి కథ, మంచి టెక్నీషియన్లతో సెట్స్ కొచ్చాం. అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా వస్తుందని ధైర్యంగా చెప్పగలను అని వినాయక్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వి.వి.వినాయక్. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments