బిగ్ బాస్-5... సురేఖా వాణి కన్ఫామా.. లేదా?

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (12:29 IST)
తెలుగు బిగ్ బాస్ సీజన్-5 కి రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సీజన్ లోగో ఆవిష్కరించారు. వచ్చే నెలలో సీజన్ 5 ను మొదలు పెట్టడం ఖాయం. అన్నపూర్ణ ఏడెకరాలలో బిగ్ బాస్ సీజన్ 5 సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. 
 
ఇక మరో వైపు పోటీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫైనల్ లిస్ట్ ఎంపిక పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్‌లో సీనియర్ నటీనటులని హౌస్ లోకి పంపిస్తూ వస్తున్నారు. 
 
గతంలో హేమ.. కరాటే కళ్యాణి వంటి వారు అలా హౌస్‌లోకి వెళ్ళారు. ఈ సీజన్ లో సీనియర్ నటి సురేఖ వాణి అలా వెళుతుందనే వార్తలు లీక్ అయ్యాయి. గత సీజన్స్‌లో కూడా సురేఖావాణి ఎంట్రీపై ఫీలర్స్ వచ్చినా అమె ఖండిచటం జరిగింది. 
 
ఆమె బిగ్‌బాస్‌పై అంత ఆసక్తి కూడా చూపించలేదు. అయితే సీజన్ 5 కు ఓకే చెప్పిందని గట్టిగా వినిపించటంతో సోషల్ మీడియాలో తాను బిగ్ బాస్ కు వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. 
 
అవి ఫేక్ న్యూస్ అనేసింది. దీంతో ఇక ఈ సీజన్ లోనూ సురేఖ బిగ్ బాస్ లో ఉండదని అనుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఫేక్ అంటూ తను పోస్ట్ చేసిన స్టోరీని డిలీట్ చేయడంతో ఈ సారి అమ్మడు ఎంట్రీ కన్ఫామ్ అంటున్నారు.
 
మొదట బిగ్ బాస్ టీమ్‌తో జరిపిన చర్చలు ఫలించలేదట. అందుకే బిగ్ బాస్ వార్తలు ఫేక్ అని పోస్ట్ చేసింది సురేఖ. ఆ తర్వాత చర్చలు సఫలం కావడం వల్ల ఎంట్రీ కి ఓకే చెప్పిన సురేఖావాణి ఫేక్ అంటూ పెట్టిన పోస్ట్ డిలీట్ చేసి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments