Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుగీటిన ప్రియకు సుప్రీంలో ఊరట.. కేసులొద్దంటూ ఆదేశాలు..

మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్వీకరించింది. దీనిపై విచారణ జరిపింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలో మాణిక్య మలరాయ పూవి పాటలో కన్నుగీటుతూ నటించిన ప్రియ

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (12:43 IST)
మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్వీకరించింది. దీనిపై విచారణ జరిపింది.  ఒరు ఆదార్ లవ్ సినిమాలో మాణిక్య మలరాయ పూవి పాటలో కన్నుగీటుతూ నటించిన ప్రియ ప్రకాశ్ వారియర్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన నేపథ్యంలో.. ఈ పాట ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా వుందంటూ ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదైంది. దీంతో తనకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ ప్రియ వారియర్ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు తెలంగాణ, మహారాష్ట్ర సహా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్‌పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేగాకుండా ప్రియా వారియర్‌తో పాటు ''ఒరు ఆదార్ లవ్'' నిర్మాతలు, దర్శకుడిపై సినిమాకు సంబంధించిన ఎలాంటి కేసులనూ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్‌ల పూర్వపరాలను, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తమ ముందు ఉంచాలని సూచించింది. దేశంలో ప్రియా వారియర్‌తో పాటు యూనిట్‌ సభ్యులపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కన్నుగీటి వివాదాల్లో చిక్కుకున్న ప్రియా వారియర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించినట్లైంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments