Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్ నటిస్తున్న రూ.100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి

స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగుల

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (20:42 IST)
స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు. నాజర్‌తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు.
 
యుద్ధ సన్నివేశాల కోసం సుమారు 1000 గుర్రాలు, ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తున్నాము. సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయి. వీటిని ముంబైలో తయారు చేస్తున్నాము. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాము. 
 
గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడాలోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలసి పనిచేస్తున్నాయి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ చిత్రాలకు పనిచేసినవారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నాము. ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫస్టులుక్  ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల చేస్తున్నాము అని తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments