Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షునిగా సునీల్ నారంగ్‌

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (17:52 IST)
Telangana state Film Chamber of Commerce
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షునిగా సునీల్ నారంగ్ ఎన్నిక‌య్యారు. శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం నూత‌న కార్య‌వ‌ర్గాన్ని స‌భ్యులు ఎన్నుకున్నారు. ఏక‌గ్రీవంగా జ‌రిగిన ఈ బాడీ రెండేళ్ళ కాల‌ప‌రిమితి. రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని సినిమారంగంపై ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వంప‌రంగా తీసుకువ‌చ్చి సినిమా అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తామ‌ని పేర్కొన్నారు.
 
ఈ కార్య‌వ‌ర్గంలో అధ్యక్షునిగా సునీల్ నారంగ్‌, ఉపాధ్య‌క్షులుగా బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌), కార్య‌ద‌ర్శి - కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి -  జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారి - ఎం.విజేంద‌ర్ రెడ్డి ఎన్నిక‌య్యారు.
Telangana comity
కార్య‌విర్వాహ‌క క‌మిటీ (ఎగ్జిక్యూటివ్ క‌మిటీ)లో - బి.లింగం గౌడ్‌, పి.సుబ్ర‌మ‌ణ్యం, డి.విష్ణు మూర్తి, ర‌వీంద్ర గోపాల్‌. జి.శ్రీనివాస్‌, బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల ర‌మేశ్‌, బి.విజ‌య్ కుమార్‌, కె.ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం.న‌రేంద‌ర్ రెడ్డి, ఎం.మోహ‌న్ కుమార్‌, కె.అశోక్ కుమార్ వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments