Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ ఆవిష్కరించిన సుందరాంగుడు టైటిల్ సాంగ్

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:05 IST)
Sundarangudu title song released by Srikanth
ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబ‌య్యాడు. లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్‌ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా 'సుందరాంగుడు’  సినిమాలోని 'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ' టైటిల్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ముఖ్య అతిథి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. నేను లాంచ్ చేసిన  'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే '  టైటిల్ సాంగ్ చాలా బాగుంది. డిసెంబర్ 17 న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు..
 
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. మా సుందరాంగుడు ట్రైటిల్ సాంగ్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఙతలు. ఈ టైటిల్ సాంగ్ దర్శకులు వినయ్ బాబు రాశారు. రవికృష్ణ కోరియోగ్రఫిలో వచ్చిన ఈ సాంగ్ అందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి... ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అంద‌మైన‌ లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. సీనియర్ నటీనటులు జీవా, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి, బాషా, మైయిన్ విలన్ గా అమిత్ తివారి నటించారు. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాలో మరో హైలైట్ అన్నారు. అంతేకాకుండా ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. డిసెంబర్ 17 విడుదల అవుతున్న  'సుందరాంగుడు' అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తాడ‌ని అన్నారు.. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.
 
ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ - మా సుందరాంగుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది.. హీరో కృష్ణ సాయి కొత్తవారైన ఎటువంటి డూప్ లేకుండా ఫైట్స్ చేశారు.. మా సినిమాను అందరూ ఆదరించాలి. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ రవికృష్ణ, పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments