పెళ్లైన కొత్తలో బికినీలో ఊయలలో కనిపించి నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న సమంత.. మళ్లీ దుస్తుల విషయంలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అక్కినేని వారింటి కోడలిగా సమంత గౌరవంగా మెలగాలని అప్పట్లో హితవు పలికిన నెటిజన్లకు.. సమ్మూ ఝలక్ ఇచ్చింది. దుస్తుల విషయంలో తనకున్న హద్దులు తనకుంటాయని ఈ విషయంలో ఎవరి సలహాలు తనకు అక్కర్లేదని చెప్పింది.
ఈ వివాదాన్ని పక్కనబెడితే తాజాగా ఫారిన్ ట్రిప్‌లో సమంత ధరించిన దుస్తుల వ్యవహారం మళ్లీ వివాదాన్ని కొని తెచ్చిపెట్టింది. ఈ మధ్యకాలంలో సమంత కూడా చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఫోటోను నెట్టింట పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రెడ్ కలర్ సెమీ బికినీలో ఆమె ఇచ్చిన స్టిల్‌పై నెటిజన్లు మండిపడుతూ కామెంట్ చేస్తున్నారు.
పెళ్లైన తర్వాత ఇలాంటి దుస్తులు ధరించడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని కోడలుగా అభిమానులకు మీపై వున్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ వివాదంపై సమంత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.