మళ్లీ నగ్నంగా నటించాలా? నాకు ఇండియన్ ఆడియెన్స్ ముఖ్యం... సన్నీ లియోన్
శృంగార తారగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుంచి బయటపడుతున్న సన్నీలియోన్‌కి భారత్‌లో కోట్లలో అభిమానులు ఉన్నారు. కేవలం హిందీలోనే కాకుండా దాదాపు భారతీయ భాషలన్నింటిలో ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ అభిమానమే ఆమె కెరీర్‌ను మరో స్థాయ
శృంగార తారగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుంచి బయటపడుతున్న సన్నీలియోన్‌కి భారత్‌లో కోట్లలో అభిమానులు ఉన్నారు. కేవలం హిందీలోనే కాకుండా దాదాపు భారతీయ భాషలన్నింటిలో ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ అభిమానమే ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగల మరొక అద్భుతమైన అవకాశాన్ని వదులుకునేలా చేసింది.
హాలీవుడ్‌లో ప్రఖ్యాత వెబ్ సిరీస్ "గేమ్ ఆఫ్ త్రోన్స్" ఇప్పటికే వచ్చిన 7 సీజన్‌లు విజయవంతంగా ప్రదర్శించబడటంతో 8వ సీజన్‌ను చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఇందులో నటించమని సన్నీలియోన్‌కు సంప్రదించడం జరిగింది. అయితే ఇందులో లెక్కకు మించిన శృంగార సన్నివేశాలు ఉండటం ఆమెకు ప్రతికూల అంశమైంది. మళ్లీ అలాంటి పాత్రల్లో నటిస్తే భారత్‌లోని ప్రేక్షకులు, ఆమె అభిమానులు దూరమైపోయే అవకాశం ఉండటంతో ఆమె ఈ ఆఫర్‌ను నిరాకరించింది.
అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్‌లో నటిస్తే డబ్బుతో పాటుగా అవకాశాలు కూడా మరిన్ని వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించిందంటే చాలా గొప్ప విషయమే.