హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతున్న కొత్త చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. మల్
హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతున్న కొత్త చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. అక్టోబర్ 27న ఆడియో, నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ``వీర్యదానం అనే కాన్సెప్ట్‌తో `నరుడా..! డోనరుడా..!` సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్తగా ఉంటుంది. నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు అల్రెడి యూ ట్యూబ్‌లో విడుదల చేసిన రెండు సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ పాటలను అక్టోబర్ 27న, సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. వీర్యదాతగా హీరో సుమంత్, ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా.ఆంజనేయులు పాత్రలో తనికెళ్ళభరణిగారి నటన ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ పల్లవి సుభాష్, సుమన్‌శెట్టి సహా ప్రతి పాత్ర విలక్షణంగా ఉంటుంది`` అన్నారు.
ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్‌దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణః అన్నపూర్ణ స్టూడియోస్, సినిమాటోగ్రఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీరణ్ పాకాల, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ః రామ్ అరసవెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ, లైన్ ప్రొడ్యూసర్ః డా. అనిల్ విశ్వనాథ్, నిర్మాతలుః వై.సుప్రియ, సుధీర్ పూదోట, దర్శకత్వం: మల్లిక్ రామ్.