Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ స‌త్య‌సాయి బాబా 2వ షెడ్యూల్ పూర్తి .. త్వరలో రిలీజ్

సౌభాగ్య చిత్ర ప‌తాకంపై తెర‌కెక్కుతున్న చిత్రం `శ్రీ స‌త్య‌సాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధ‌తి`, `దేవుళ్లు` వంటి విజువ‌ల్ వండ‌ర్స్‌ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `దేవ

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (16:19 IST)
సౌభాగ్య చిత్ర ప‌తాకంపై తెర‌కెక్కుతున్న చిత్రం `శ్రీ స‌త్య‌సాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధ‌తి`, `దేవుళ్లు` వంటి విజువ‌ల్ వండ‌ర్స్‌ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `దేవుళ్లు` నిర్మాత‌ క‌రాటం రాంబాబు నిర్మిస్తున్నారు. పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబాపై తెర‌కెక్కిస్తున్న భ‌క్తి చిత్ర‌మిది. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు సింగిల్ కార్డ్‌లో 14 పాట‌లకు సాహిత్యం అందించ‌డం విశేషం. 
 
ఇటీవ‌లే మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. అక్టోబ‌ర్ 14 నుంచి 2వ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ, సార‌థి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో తెర‌కెక్కించారు. తాజా షెడ్యూల్ పూర్త‌యింది. ఈ షెడ్యూల్లో ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. 
 
స‌త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీ‌జిత్ విజ‌య్ న‌టిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తిగా జ‌య‌ప్ర‌ద‌, తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్‌బాబు న‌టిస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్‌కి మేక‌ప్‌మేన్‌గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. 
 
ఇందులో ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, హ‌రిహ‌ర‌న్‌, బాల ముర‌ళి కృష్ణ‌, చిత్ర‌, హ‌రిచ‌ర‌ణ్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, క‌వితా కృష్ణ‌మూర్తి, కైలాస్ గురి, సుఖ్వింద‌ర్ సింగ్, మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్‌, ఆండ్రియా, టిప్పు త‌దిత‌రులు గానాలాప‌న చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయాగ్రాహ‌కుడు బి.వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments