Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి, రాఘ‌వేంద్ర‌రావు పై కోపం వ్య‌క్తం చేసిన సుమ‌

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (21:33 IST)
Suma
యాంక‌ర్ సుమ న‌టించిన  'జయమ్మ పంచాయితీ` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన‌ప్ప‌టినుంచీ సుమ సీరియ‌స్‌గానే వుంది. ఆహుతులు కూల్ చేసినా విన‌లేదు. అందుకు కార‌ణం రాజ‌మౌళి, కె. రాఘ‌వేంద్ర‌రావు వంటివారు హాజరుకాక‌పోవ‌డ‌మే. దాంతో తాము ఎందుకు రాలేదో చిన్న వీడియో బైట్‌ను విడుద‌ల చేశారు. 
 
అందులో కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, సుమ నువ్వు మాట‌ల్తో ప‌డేస్తావు. నేను షూటింగ్ పాట‌తో ప‌డేయాల‌ని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాత్రి షూట్ లో వున్నానంటూ, నా వెనుక కెమెరా కూడా వుందంటూ చూపిస్తూ అందుకే రాలేక‌పోయాను.  'జయమ్మ పంచాయితీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ తెలిపారు.
 
ఇక రాజ‌మౌళి త‌న బైట్‌లో మాట్లాడుతూ, అమ్మ జ‌య‌మ్మ‌, సుమ‌మ్మ ఎప్ప‌టినుంచో ఫ్యామిలీ ట్రిప్ అనుకున్న‌ట్లు మేం వెళ్ళాం. కాబ‌ట్టి రాలేక‌పోయాను.నా ప్ర‌తి సినిమాకు మీరే చేయాలి. దీన్ని సాకుగా చూపిస్తూ నా త‌ర్వాత సినిమాకు ఎగ్గొట్టొద్దు. నామీద పంచాయితీ పెట్ట‌వ‌ద్దు.  'జయమ్మ పంచాయితీ` చిత్రం అంద‌రం క‌లిసి చూద్దాం అంటూ వివ‌రించారు. అయినా ఇదేదో ఫేక్‌గా వుందంటూ సుమ స‌ర‌దా కామెంట్ చేసింది. అనంత‌రం గాయ‌కుడు శ్రీ‌కృష్ణ ఓ పాట‌తో సుమ‌ను కూల్ చేశాడు. ఇదంతా  'జయమ్మ పంచాయితీ` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌లో స‌ర‌దాగా సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments