Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా 154 షూటింగ్ సెట్స్‌ను సందర్శించిన సుకుమార్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (20:06 IST)
Sukumar, Bobby
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుకుమార్ మెగా154 సెట్స్‌ని సందర్శించారు. సుకుమార్ సెట్స్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్‌ కి లాప్ టాప్ లో ఎదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడటంలో ఈ చిత్రంలో గమనించవచ్చు.
 
మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగాస్టార్‌తో శృతి హాసన్‌ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టారు.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా,  ఎఎస్‌ ప్రకాష్‌  ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
 
నటీనటులు: చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాతలు: నవీన్ యెర్నేని,  వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments